Vijayawada: విజయవాడ దుర్గగుడి పాలక మండలి రాజీనామా... ప్రభుత్వం మార్పు ఎఫెక్ట్‌

  • చైర్మన్‌తోపాటు సభ్యుల రాజీనామా
  • టీడీపీ ప్రభుత్వం హయాంలో నియామకం
  • వైసీపీ అధికారంలోకి రావడంతో తప్పుకున్న కార్యవర్గం
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి ప్రభావం కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నియమితులైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం పాలక మండలి ఈరోజు రాజీనామా చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్‌ ఆధ్వర్యంలో ఈనెల 30న కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న విషయం తెలిసిందే. దీంతో పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులు ఈరోజు రాజీనామా చేసి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌కు దాన్ని పంపించారు. నవ్యాంధ్రలో అత్యంత ప్రముఖ దేవాలయాల్లో విజయవాడ దుర్గగుడి ఒకటి. ప్రస్తుత పాలకమండలి రాజీనామాతో కొత్త పాలక మండలి నియామకానికి మార్గం సుగమమైనట్టే.
Vijayawada
durag temple
palaka mandali

More Telugu News