Jayaprada: ప్రత్యర్థులతో కలిసి నన్ను ఓడించారు: జయప్రద

  • సొంత పార్టీ నేతలే నా ఓటమికి కారణం
  • వారి పేర్లను అధిష్ఠానం దృష్టికి తీసుకెళతా
  • లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో అజంఖాన్ విజయం
ప్రముఖ నటి, రామ్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ఎన్నికల్లో తన ఓటమి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అజంఖాన్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో జయప్రదపై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, తన ఓటమి వెనుక కారణాలను వెల్లడించారు. తమ సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులతో కలిసి తనను ఓడించారని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి కారణమైన వారి పేర్లను అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని ఆమె తెలిపారు.

Jayaprada
Ajam Khan
Samajvadi Party
Own Party leaders

More Telugu News