sudigali sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా 'సాఫ్ట్ వేర్ సుధీర్'

  • 'జబర్దస్త్' ద్వారా పాప్యులర్ అయిన సుధీర్ 
  • త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు
  •  సుధీర్ జోడీగా ధన్యా బాలకృష్ణ  

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది హాస్యనటులు పాప్యులర్ అయ్యారు. ఈ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నవారు సినిమాల్లోను బిజీ అవుతున్నారు. అలా అడపా దడపా వెండితెరపై కనిపిస్తోన్న వారిలో సుడిగాలి సుధాకర్ ఒకరు. చిన్న చిన్న పాత్రల నుంచి ఎదిగిన సుధీర్ .. హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఆయన హీరోగా 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమా రూపొందుతోంది. శేఖర్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా పులిచర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోసాని కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో సుధీర్ జోడీగా ధన్యా బాలకృష్ణ కనిపించనుంది. జూలై చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హీరోగా సుధీర్ ఎంతవరకూ రాణిస్తాడో చూడాలి మరి. 

  • Loading...

More Telugu News