Chandrababu: చంద్రబాబుతో బాలకృష్ణ భేటీ.. పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చ

  • నారా లోకేశ్‌తో పాటు భరత్ ఓటమి
  • ఇప్పటికి పార్టీ 5 సార్లు విజయం.. నాలుగు సార్లు ఓటమి
  • ఇంతటి ఘోర వైఫల్యం ఇదే తొలిసారి
టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ నటుడు, ఆ పార్టీ నేత బాలకృష్ణ భేటీ అయ్యారు. నిన్నటి ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని తీవ్ర నిరాశలో పడేశాయి. చివరకు నారా లోకేశ్‌తో పాటు బాలయ్య చిన్న అల్లుడు భరత్ కూడా ఓటమి పాలయ్యారు. టీడీపీ ఏర్పాటైన అనంతరం ఐదు సార్లు విజయం సాధించగా, ఇప్పటికి నాలుగు సార్లు పరాజయం పాలైంది.

అయితే ఇంతటి ఘోర వైఫల్యం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, బాలకృష్ణ భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అలాగే పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది.  
Chandrababu
Balakrishna
Bharath
Nara Lokesh
Telugudesam

More Telugu News