Andhra Pradesh: రేపు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం

  • రేపు ఉదయం 10.31 గంటలకు సమావేశం
  • శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
  • అనంతరం గవర్నర్ ను కలవనున్న జగన్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ క్యాంప్ కార్యాలయంలో రేపు శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రేపు ఉదయం 10.31 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వానం అందింది.

రేపు ఉదయం 9.45 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం. శాసనసభాపక్ష సమావేశం అనంతరం గవర్నర్ నరసింహన్ ను జగన్, పార్టీ ముఖ్య నేతలు కలిసి తీర్మాన ప్రతిని అందజేయనున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 11.30 గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరుగుతుందని చెప్పారు.
Andhra Pradesh
tadepally
YSRCP
LP
meeting

More Telugu News