Telangana: తెలంగాణలో 3 నెలలుగా పాలన పడకేసింది.. అందుకే ప్రజలు తిరస్కరించారు!: కోదండరాం

  • కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు
  • ఆదివాసీలు, రైతులు ఆగ్రహంగా ఉన్నారు
  • అందుకే కవిత, వినోద్ ఓడిపోయారు
  • సూర్యపేటలో మీడియాతో టీజేఎస్ అధినేత
తెలంగాణలో గత మూడు నెలలుగా సరైన పాలన లేదని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత కోదండరాం విమర్శించారు. అందుకే ప్రజలంతా విసిగిపోయారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో రాష్ట్రంలో పాలన పడకేసిందని దుయ్యబట్టారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. సూర్యాపేటలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బి.వినోద్ కుమార్ ల ఓటమికి ఆదివాసీలు, రైతుల ఆగ్రహమే కారణమని విశ్లేషించారు.
Telangana
Congress
tjs
Kodandaram
TRS

More Telugu News