Telangana: ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారు: బండి సంజయ్

  • కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన సంజయ్
  • రాష్ట్రంలో కేంద్ర పథకాలే ప్రజలకు అందుతున్నాయి
  • తెలంగాణలో బొందుగాళ్లకు స్థానం లేదని తేల్చారు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ నాలుగు స్థానాల్లో కరీంనగర్ ఎంపీ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఏ గ్రామానికెళ్లినా టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటీ అందడం లేదని అన్నారు. తెలంగాణలో హిందువులకు తప్ప బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారంటూ కేసీఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు.
Telangana
loksabha
bandi sanjay
karimnagar
bjp
TRS
kcr

More Telugu News