Srinivasarao: జైలు నుంచి విడుదలైన జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు!

  • విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి
  • అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసరావు
  • రూ. 60 వేల పూచీకత్తుపై బెయిల్
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. తన క్లయింట్ కు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టులో న్యాయవాది సలీమ్ వాదనలు వినిపించగా, రూ. 60 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరి హామీపై బెయిల్ మంజూరైంది.

 శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, డెంగీ, మలేరియా, అజీర్ణం అతన్ని ఇబ్బందులు పెడుతున్నాయని, వీటి కారణంగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరించారని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ప్రాసిక్యూషన్ అభిప్రాయాన్ని కూడా తీసుకుని బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
Srinivasarao
Jagan
Murder Attempt
Jail
Bail

More Telugu News