Hema Malini: 2.9 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించిన హేమమాలిని

  • మహాకూటమి అభ్యర్థి కున్వర్ సింగ్‌పై ఘన విజయం
  • మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్
  • మథురలో హేమమాలినికి వరుసగా రెండో విజయం
బీజేపీ సీనియర్ నేత, మథుర అభ్యర్థి హేమమాలిని ఘన విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి బరిలోకి దిగిన ఆమె.. తన సమీప ప్రత్యర్థి, ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి నేత కున్వర్ నరేంద్ర సింగ్‌పై ఏకంగా 2,93,471 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానం నుంచి హేమమాలిని గెలవడం ఇది రెండోసారి. 2014 ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరిపై 3,30,743 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి  మహేశ్ పాఠక్ 28,084 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు.  

తాజా ఎన్నికల్లో ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం.. ఎన్డీయే కూటమి 333 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ కూటమి 91 స్థానాలను గెలుచుకుంది. ఇతరులు 83 స్థానాల్లో విజయం సాధించారు.
Hema Malini
BJP
Congress
SP
BSP
RLD

More Telugu News