vijayashanthi: ప్రజలిచ్చిన తీర్పు సరైనదో? కాదో? కాలమే నిర్ణయిస్తుంది: విజయశాంతి

  • తెలంగాణలో మూడు స్థానాల్లో విజయాన్ని అందుకున్న కాంగ్రెస్
  • పార్టీలకు అతీతంగా విజేతలకు అభినందనలు
  • కాంగ్రెస్‌కు విజయాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. దేశవ్యాప్తంగా ఎన్డీయేకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పిన విజయశాంతి.. ఆ తీర్పు సరైనదో? కాదో? కాలమే నిర్ణయిస్తుందన్నారు. గెలుపొందిన అభ్యర్థులందరినీ పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  

నిన్న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్‌ ఊరటనిచ్చే విజయాలు అందుకుంది. తెలంగాణలో నల్గొండ, మల్కాజిగిరి, భువనగిరి స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి చివరి వరకు పోరాడినా టీఆర్‌ఆర్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక, బీజేపీ కూడా నాలుగు స్థానాల్లో విజయం సాధించి టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది.
vijayashanthi
Telangana
Congress
TRS
NDA
BJP

More Telugu News