Venkaiah Naidu: జగన్‌కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

  • వైసీపీకి అభినందనల వెల్లువ
  • సహకారం అందిస్తానన్న వెంకయ్యనాయుడు
  • హర్షం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాసేపటి క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ నెల 30న విజయవాడలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Venkaiah Naidu
Vice President
Phone
Vijayawada
Jagan
YSRCP

More Telugu News