Jansena: సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ కు శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

  • వైసీపీ బలమైన మెజార్టీతో విజయం సాధించింది
  • మరోమారు ప్రధాని కానున్న మోదీకి శుభాకాంక్షలు
  • ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’పై ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
బలమైన మెజార్టీతో విజయం సాధించిన వైసీపీకి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మరోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో, ఏపీలో స్పష్టమైన మెజార్టీలతో బీజేపీ, వైసీపీలు విజయం సాధించాయి కనుక, ఆంధ్రప్రదేశ్ కు ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’పై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ‘నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాను. ప్రజలకు అండగా ఉంటా, ప్రజా సమస్యలపై పోరాడతా’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 
Jansena
Pawan Kalyan
YSRCP
jagan

More Telugu News