YSRCP: హిందూపూర్‌లో బాలయ్య ఘన విజయం

  • మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న బాలయ్య
  • వైసీపీ అభ్యర్థిగా మహ్మద్ ఇక్బాల్ పోటీ
  • జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యం
హిందూపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ రెండోసారి కూడా ఘన విజయం సాధించారు. 2014లో హిందూపూర్ నుంచి ఘన విజయం సాధించిన బాలయ్య మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఈ స్థానం ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంది.

ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా మహ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. తొలి రౌండ్ నుంచే బాలయ్య స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలకు గాను, 13 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, హిందూపూర్‌లో మాత్రం బాలయ్య ఘన విజయం సాధించారు.
YSRCP
Balakrishna
Md Iqbal
Ananthapuram
Hindupur

More Telugu News