Vijayawada: ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తున్నా: వైెఎస్ జగన్

  • ఏపీ చరిత్రలో ఇంత గొప్ప విజయం నమోదు కాలేదు
  • ఏపీ చరిత్రలో ఇదో నూతన అధ్యాయం
  • తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ తేదీన, ఎక్కడ జరుగుతుందన్న విషయమై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహు:శ ఇంత గొప్ప విజయం ఇంత వరకూ నమోదు కాలేదేమోనని అన్నారు.

 ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తమ పార్టీకే రావడం, 153 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా వైసీపీ ఆధిక్యంలో ఉండటం ఏపీ చరిత్రలో ఇదో నూతన అధ్యాయంగా అభివర్ణించారు. తమ పార్టీకి అద్భుత మెజార్టీ అందించిన ప్రజలకు జగన్ కృతఙ్ఞతలు తెలిపారు. సీఎంగా ఎప్పుడు, ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న విలేకరుల ప్రశ్నకు జగన్ స్పందిస్తూ, ఈ నెల 30న ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరుగుతుందని స్పష్టం చేశారు.
Vijayawada
YSRCP
jagan
cm
tadepalli

More Telugu News