భోపాల్ లో డిగ్గీ రాజా ఓటమి.. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ జయకేతనం
- రెండు లక్షల మెజారిటీ
- వివాదాలకు మరోపేరు సాధ్వీ ప్రజ్ఞా
- తీవ్ర వ్యాఖ్యలతో కలకలం రేపిన వైనం
మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలైన ప్రజ్ఞాకు టికెట్ కేటాయించడంతో బీజేపీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆపై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై వ్యాఖ్యలు, గాడ్సే వివాదంతో ప్రజ్ఞా సింగ్ పై బీజేపీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అయితే, అన్నింటినీ అధిగమిస్తూ ఈ వివాదాస్పద సాధ్వీ భారీ మెజారిటీతో గెలవడం పెద్ద విశేషం!