Jagan: రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను: జగన్

  • ఇది ప్రజావిజయం
  • అందరికీ కృతజ్ఞతలు
  • ఫేస్ బుక్ లో జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు సాధించే దిశగా దూసుకెళుతోంది వైసీపీ. దీనిపై ఆ పార్టీ అధినేత, కాబోయే సీఎం జగన్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ముచేయబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పట్ల ఆదరణ చూపిన ప్రజలందరికీ, ఓటు హక్కు వినియోగించుకున్న యావత్ రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇది ప్రజావిజయం అని వివరించారు.

కాగా, ఏపీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న జగన్ కు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ వంటి అగ్రనేతలు సైతం జగన్ కు విషెస్ చెప్పారు. ఇక, సామాజిక మాధ్యమాల్లో జగన్ పై వస్తున్న పోస్టులకు లెక్కేలేదు!
Jagan
Facebook

More Telugu News