Pawan Kalyan: భీమవరంలో పడుతూ లేస్తూ సాగుతున్న పవన్ కల్యాణ్!

  • 9వ రౌండ్ సమయానికి పవన్ ఆధిక్యం 200 ఓట్లు
  • గాజువాకలో సైడయిపోయిన జనసేనాని!
  • జనసేనకు దిగ్భ్రాంతికర ఫలితాలు

ఎన్నో ఆశలు, ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ కు ఈ ఎన్నికలు ఓ పాఠం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఆ పార్టీ స్థానం, స్థాయి ఏంటన్నది కాసేపట్లోనే వెల్లడైంది. కౌంటింగ్ మొదలైన క్షణం నుంచి చివరిస్థానంలో ఉన్న జనసేన ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. కనీసం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గెలుపుపైనా ఎవరూ నమ్మకం వ్యక్తం చేయలేకపోతున్నారు. గాజువాకలో పవన్ పూర్తిగా సైడయిపోగా, భీమవరంలో మాత్రం కాసేపు వెనుకబడినా, కాసేపు ఆధిక్యంలోకి వస్తున్నారు. 9వ రౌండ్ సమయానికి పవన్ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో నిలిచారు. అయితే ఈ ఆధిక్యం ఎంతసేపు నిలుస్తుందన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News