Telangana: తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం!

  • ఆధిక్యంలో ఉత్తమ్, బండి సంజయ్
  • చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి దూకుడు
  • తెలంగాణలో 9 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం
తెలంగాణలో తొలిసారి బీజేపీ సత్తా చాటుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాబూరావు 37,000 ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కరీంనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్ 9 రౌండ్లు ముగిసేసరికి 58,000 ఓట్ల మెజారిటీ సాధించారు.

సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి 35,000 ఓట్ల మెజారిటీతో సాగుతున్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి 8,000 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 9 చోట్ల టీఆర్ఎస్ లీడింగ్ లో ఉండగా, కాంగ్రెస్ 3, బీజేపీ 4, మజ్లిస్ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలోని చీరాలలో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి చేతిలో వెనుకపడ్డారు.
Telangana
loksabha
Congress
BJP
TRS

More Telugu News