Andhra Pradesh: గాజువాకలో కోలుకున్న పవన్ కల్యాణ్.. విశాఖలో జేడీ లక్ష్మీనారాయణ వెనుకంజ!

  • భీమవరంలో మూడోస్థానానికి జనసేనాని
  • జేడీకి షాక్ ఇచ్చిన విశాఖ ఓటర్లు
  • విశాఖలో 21,000 ఆధిక్యంలో వైసీపీ నేత ఎంవీవీ
భీమవరంలో మూడో స్థానంలో నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా విశాఖపట్నంలోని గాజువాకలో ఆధిక్యం చూపుతున్నారు. మరోవైపు విశాఖ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ, వీవీ లక్ష్మీనారాయణకు విశాఖ వాసులు షాక్ ఇచ్చారు.

వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ వీవీ లక్ష్మీనారాయణపై 21,000 ఓట్ల లీడింగ్ తో దూసుకుపోతున్నారు. అలాగే నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు జనసేన అభ్యర్థి కొణిదెల నాగబాబు, టీడీపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజులపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం వైసీపీ 145 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా, టీడీపీ 29 స్థానాలకు పరిమితమయింది.
Andhra Pradesh
gajuwaka
Pawan Kalyan
Jana Sena
YSRCP
Telugudesam

More Telugu News