BJP: కేరళలో బీజేపీకి ఈసారీ నిరాశే.. దూసుకుపోతున్న యూడీఎఫ్

  • కేరళలో కనిపించని బీజేపీ హవా
  • కర్ణాటకలో దూసుకుపోతున్న కమలం
  • ఒడిశాలోనూ బీజేపీ దూకుడు
కేరళలో ఈసారి కూడా బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. అక్కడ యూడీఎఫ్ కూటమి పూర్తి మెజారిటీ దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం యూడీఎఫ్ 19కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేదు. ఎల్‌డీఎఫ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కేరళలో గెలవడం ద్వారా దక్షిణాదిలో పాగా వేయాలని కలలు కన్న బీజేపీకి ఆ కలలు నెరవేరేలా కనిపించడం లేదు.

అయితే, పక్కనే ఉన్న కర్ణాటకలో మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 23 స్థానాల్లో కమలం పార్టీ ఆధిక్యంలో ఉండగా, అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 5 స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపుతోంది. ప్రకాశ్ రాజ్ వంటి ఇమేజ్ వున్న అభ్యర్థులు కూడా వెనకంజలోనే ఉన్నారు. మరోవైపు ఒడిశాలోనూ బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. పది స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంటే, నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
BJP
kerala
Karnataka
Odisha

More Telugu News