Chandrababu: సంబరాలు మొదలు... చంద్రబాబుకు వినిపించేలా బాణసంచా కాలుస్తున్న వైసీపీ కార్యకర్తలు!

  • ఉండవల్లిలోనే చంద్రబాబు, జగన్ నివాసాలు
  • భారీఎత్తున బాణసంచా కాలుస్తున్న వైసీపీ కార్యకర్తలు
  • ప్రజావేదిక వరకూ వినిపిస్తున్న శబ్ధాలు
గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఇక్కడికి పెద్దఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టబోయేది జగన్ నేతృత్వంలోని తమ పార్టీయేనన్న అంచనాకు వచ్చేసిన కార్యకర్తలు, వైసీపీ కేంద్ర కార్యాలయానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు నివాసానికి వినిపించేలా బాణసంచా పేలుళ్లతో దడదడలాడిస్తున్నారు. ఉండవల్లిలో జగన్, చంద్రబాబు నివాసాల మధ్య ఎయిర్ డిస్టెన్స్ కిలోమీటర్ కూడా లేకపోవడంతో వైసీపీ శ్రేణులు కాలుస్తున్న బాణసంచా కాంతులు ప్రజా వేదిక వరకూ కనిపిస్తుండటం గమనార్హం.
Chandrababu
Jagan
Crakers
Elections

More Telugu News