Election: అమేథీలో రాహుల్.. రాయ్‌బరేలీలో సోనియగాంధీ ఆధిక్యం

  • ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఎన్‌డీఏ
  • మధురలో హేమమాలిని లీడ్
  • లక్నోలో రాజ్‌నాథ్ సింగ్
ఉదయం ఎనిమిది గంటలకు దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. ఆధిక్యాలు వెల్లడవుతున్నాయి. బీజేపీ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఎన్‌డీఏ 105, యూపీఏ 29, ఇతరులు 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆధిక్యంలో ఉండగా, అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆధిక్యంలో ఉన్నారు. మధురలో హేమమాలిని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లక్నోలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లీడ్‌లో ఉన్నారు.
Election
Rajnath singh
Rahul Gandhi
Sonia Gandhi
Hema Malini

More Telugu News