man booker prize: ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ అందుకున్న ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి

  • ఇంత వరకూ ఏ అరబిక్ రచయితకు దక్కని పురస్కారం
  • ‘సెలెస్టియల్ బాడీస్’ నవలా రచయిత్రి జోఖా
  • ఆ నవలను ఆంగ్లంలోకి అనువదించిన మేరిలిన్ బూత్
అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ను ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి అందుకున్నారు. ఆమె రచించిన ‘సెలెస్టియల్ బాడీస్’ నవలకు ఈ పురస్కారం దక్కింది. ఈ నవలను రచయిత్రి మేరిలిన్ బూత్ ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్లంలోకి అనువదించిన ఉత్తమ నవల కింద ‘సెలెస్టియల్ బాడీస్’కు ఈ పురస్కారం దక్కింది. ఈ ఇద్దరు రచయిత్రులకు మ్యాన్ బుకర్ ప్రైజ్ కింద 63,000 అమెరికన్ డాలర్లను నిర్వాహకులు అందజేశారు.

ఇంత వరకూ ఏ అరబిక్ రచయితకు దక్కని అత్యున్నత పురస్కారం దక్కించుకున్న జోఖా అల్హార్తి వయసు నలభై ఏళ్లు. ఈ పురస్కారం అందుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, అరబిక్ సంస్కృతిని తెలిపే ఓ ద్వారం తెరచుకుందని, చాలా థ్రిల్ గా ఉందని అన్నారు. కాగా, రచయిత్రి జోఖా అల్హార్తి గురించి చెప్పాలంటే.. ఇప్పటి వరకూ ఆమె అరబిక్ భాషలో మూడు నవలలు రాశారు. పిల్లల కోసం ఆమె పుస్తకాలు రాస్తుంటారు.
man booker prize
celestial bodies
oman
jokha

More Telugu News