Karnataka: కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం: సదానంద గౌడ

  • ఎల్లుండి వరకే కుమారస్వామి సీఎం
  • పదవి నుంచి తప్పుకోవడం ఖాయం
  • కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌-జీడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందని కేంద్రమంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుమారస్వామి రేపు సాయంత్రం, మహా అయితే ఎల్లుండి ఉదయం వరకు మాత్రమే సీఎం పదవిలో ఉంటారని జోస్యం చెప్పారు. కుమారస్వామి సీఎం పదవి నుంచి తప్పుకోవడం ఖాయమని, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైందని అన్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి ఫలితాలు పెద్దగా ఆశాజనకంగా ఉండవని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నేపథ్యంలో సదానంద గౌడ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
Karnataka
Sadananda Gouda
Kumara Swamy
Congress-JDS
Loksabha

More Telugu News