Vijayawada: కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ని రాత్రికి రాత్రే మార్చారు: ఈసీకి వైసీపీ ఫిర్యాదు

  • మిల్క్ యూనియన్ చైర్మన్ గా చలసాని నియామకం
  • ఈ నియామకంపై వైసీపీ అభ్యంతరం 
  • ‘కోడ్’ అమల్లో ఉండగా రాజకీయ నియామకాలు తగదు
ఏపీలోని కృష్ణా మిల్క్ యూనియన్ వివాదంపై సీఈఓ ద్వివేదికి వైసీపీ ఫిర్యాదు చేసింది. మిల్క్ యూనియన్ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులుని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ద్వివేదికి వైసీపీ నేత దాసరి బాలవర్ధనరావు ఫిర్యాదు చేశారు. మిల్క్ యూనియన్ చైర్మన్ ని రాత్రికి రాత్రే మంత్రి దేవినేని ఉమ మార్చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజకీయ నియామకాలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Vijayawada
krishna milk union
ECO
YSRCP

More Telugu News