Loksabha: క్వింటాళ్ల కొద్దీ లడ్డూలు ఆర్డర్ చేసిన పంజాబ్ నేతలు!

  • ఎగ్జిట్ పోల్స్ అనంతరం గెలుపుపై ధీమాతో నేతలు
  • బాణసంచాకు, స్వీట్లకు పెద్ద డిమాండ్  
  • కార్యకర్తలకు పంచేందుకు లడ్డూల ఆర్డర్
లోక్‌సభ ఫలితాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అన్ని పార్టీలు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున స్వీట్స్ తయారు చేయించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం బాణసంచా, స్వీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పంజాబ్‌లో వివిధ పార్టీల నేతలు దాదాపు 12 కింట్వాళ్ల లడ్డూలను ఆర్డర్ చేశారని సమాచారం.

లడ్డూలు ఆర్డర్ చేసిన వారిలో బీజేపీతో పాటు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ నేతలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అనంతరం నేతల్లో గెలుపుపై మరింత ధీమా ఏర్పడింది. దీంతో తమ కార్యకర్తలకు పంచేందుకు వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున స్వీట్స్ ఆర్డర్ చేస్తున్నారు.
Loksabha
Laddu
Punjab
BJP
Congress
Siromani Akalidal

More Telugu News