VVPATS: ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్లు లెక్కించడం కుదరదు: విపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చిన ఈసీ

  • త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం
  • ఈసీని కలిసిన నేతలు
  • ప్రతిపక్షాలకు చుక్కెదురు

ఓట్ల లెక్కింపులో భాగంగా ఈవీఎం ఓట్ల కంటే ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. వీవీ ప్యాట్లను ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే లెక్కిస్తారని మరోసారి స్పష్టం చేసింది. 22 రాజకీయ పక్షాలకు చెందిన నేతలు, ప్రతినిధులు మంగళవారం ఈసీని కలిసి ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని విజ్ఞప్తి చేశారు. ఈసీని కలిసినవారిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, డీఎంకే మహిళా నేత కనిమొళి, వామపక్ష ప్రముఖులు ఉన్నారు.

కాగా, వీవీ ప్యాట్ల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని ఆయా పార్టీల నేతలతో నిన్న ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిటీ తాజాగా సమావేశమై చర్చించింది. రాజకీయ పక్షాల వినతి మేరకు వీవీ ప్యాట్లను మొదటే లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది.

More Telugu News