IRCTC: పర్యాటక కేంద్రాల సందర్శనకు తెలుగు వారికి ప్రత్యేక రైలు!

  • యాత్రా స్పెషల్‌ సిద్ధం చేస్తున్న ఐఆర్‌సీటీసీ
  • 11 కోచ్‌లున్న రైలులో 8 పాసింజర్‌ కోచ్‌లు
  • అన్నీ ఏసీ బోగీలే

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు సందర్శించాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) యాత్రా దర్శన్‌ పేరుతో ప్రత్యేక ఏసీ రైలును అందుబాటులోకి తెస్తోంది. ఏడాది మొత్తం తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండే ఈ రైలులో 11 కోచ్‌లు ఉండగా అందులో 8 పాసింజరు కోచ్‌లు. అన్నీ ఏసీ బోగీలే ఆవడం మరో విశేషం.

ఇప్పటి వరకు భారత్‌ దర్శన్‌ పేరుతో 12 కోచ్‌ల ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. అయితే ఈ రైలు ఏడాదిలో మూడు నెలలు మాత్రమే ఐఆర్‌సీటీసీకి అందుబాటులో ఉండేది. దీనివల్ల తమ పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక బోగీలు బుక్‌ చేసుకోవడం, ఆయా స్టేషన్లలో దిగాక ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవడం చేసుకునేది. ఇకపై ఈ సమస్య ఉండదు. పర్యాటకాసక్తి ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌ కేంద్రంగా బయలుదేరే ఈ రైలులో భారత దేశంలోని అన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల సందర్శనకు తీసుకువెళ్తారు. ఆయా సందర్భాలు, పర్యాటకుల డిమాండ్‌ మేరకు ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లాలన్నది నిర్ణయిస్తారు. విద్యార్థుల కోసం విజ్ఞాన, వికాస యాత్రలు కూడా చేపడతారు.

More Telugu News