Kona Venkat: పవన్ కల్యాణ్ చేసిన ఆ రెండు తప్పులే కొంపముంచనున్నాయి: రచయిత కోన వెంకట్
- తప్పుడు సలహాలు విన్న పవన్ కల్యాణ్
- టీఆర్ఎస్, వైసీపీ మధ్య సంబంధాలు అంటగట్టారు
- మాయావతితో పొత్తు మరో తప్పన్న కోన వెంకట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు తప్పులు చేశారని, ఆ రెండు తప్పులే ఆయన కొంపముంచనున్నాయని సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ విశ్లేషించారు. తన పార్టీ నేతలు కొందరు చెప్పిన తప్పుడు సలహాలు విని, టీఆర్ఎస్ తో వైసీపీకి సంబంధాలను అంటగట్టడం పవన్ చేసిన తొలి తప్పని ఆయన అన్నారు.ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాత్ర ఎంతమాత్రమూ లేదని, దీన్ని పవన్ మరిచారని అన్నారు.
ఇక, ఆయన చేసిన రెండో తప్పు, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడమేనని అన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మాయావతితో పొత్తు ఏంటని ప్రశ్నించిన ఆయన, క్లీన్ పాలిటిక్స్ అని చెప్పుకుని తిరిగే పవన్, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశారని అన్నారు.