Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభాస్ కి కంగ్రాట్స్ చెప్పిన  అనుష్క 
  • విజయ్ దేవరకొండ 'బ్రేక్ అప్'
  • మహేశ్ 'మహర్షి' మరో రికార్డు  

*  హీరో ప్రభాస్ పట్ల వున్న తన అభిమానాన్ని కథానాయిక అనుష్క మరోసారి చాటుకుంది. నిన్న రిలీజైన ప్రభాస్ 'సాహో' తాజా లుక్ పై ఆమె స్పందిస్తూ, ఈ చిత్రం నుంచి వచ్చే ప్రతిదీ వాట్ నెక్స్ట్ అనేలా ఆసక్తిని పెంచుతూ ఆలోచనలో పడేస్తోంది. అందుకే ఆగస్టు 15 కోసం ఏంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను.. ప్రభాస్ తో పాటు అందరికీ కంగ్రాట్స్' అంటూ అనుష్క ట్వీట్ చేసింది.
*  విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'బ్రేక్ అప్' అనే టైటిల్ని నిర్ణయించనున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  మహేశ్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన 'మహర్షి' చిత్రం మంచి ప్రేక్షకాదరణతో కలెక్షన్లలో దూసుకుపోతోంది. విశేషం ఏమిటంటే, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలోని 21 ప్రధాన సెంటర్లలో ఈ చిత్రం కోటి రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. 

More Telugu News