Praveen Kumar: హైదరాబాదులో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిపై దాడి

  • దాడికి పాల్పడిన ఓయూ విద్యార్థి అలెగ్జాండర్
  • గురుకులాల్లో అక్రమాలపై ప్రెస్‌మీట్
  • ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు చేస్తుండగా దాడి
పాత్రికేయుల సమావేశానికి వచ్చిన వ్యక్తులపై ఓయూ విద్యార్థి అలెగ్జాండర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. నేడు జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్నె శ్రీశైలం, తెలంగాణ గురుకులాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని పేర్కొంటూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి అలెగ్జాండర్ తన అనుచరులతో హాజరయ్యాడు.

గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై శ్రీశైలం ఆరోపణలు చేస్తుండగా ఆయనపై దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన పాత్రికేయులపైనా దాడి చేశారు. పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అలెగ్జాండర్ నిన్న తనకు ఫోన్ చేసి బెదిరించాడని, నేడు దాడికి పాల్పడ్డాడని శ్రీశైలం ఆరోపించారు. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Praveen Kumar
Karne Srisailam
Alexander
Somajiguda
Press Club

More Telugu News