BCCI: బీసీసీఐ ఎన్నికలకు తేదీని ఖరారు చేసిన సీవోఏ

  • ముగ్గురు మెంబర్లతో కూడిన కమిటీ సమావేశం
  • అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
  • సెప్టెంబర్ 23 లోగా పేర్లను పంపించాలని సీవోఏ స్పష్టం

బీసీసీఐకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ముగ్గురు మెంబర్లతో కూడా సీవోఏ కమిటీ నేడు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సీవోఏ పేర్కొంది. ఈ ఎన్నికలకు సంబంధించి తేదీని కూడా ఖరారు చేసింది. అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. సెప్టెంబర్ 14 లోపు రాష్ట్ర అసోసియేషన్స్ కు ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రతినిధుల పేర్లను బీసీసీఐకి సెప్టెంబర్ 23 లోపు పంపించాలని సీవోఏ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News