mulayam singh: అఖిలేష్, ములాయంలకు ఊరట.. క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ

  • అక్రమాస్తుల కేసులో క్లీన్ చిట్
  • 2013 ఆగస్టులో కేసును మూసివేశామని సుప్రీంకు తెలిపిన సీబీఐ
  • ఆధారాలు లేనందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడి

అక్రమాస్తుల కేసులో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ లకు ఊరట లభించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ... తండ్రీకొడుకులిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇద్దరికీ వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని... ఈ నేపథ్యంలో 2013 ఆగస్టులో కేసును మూసివేసినట్టు ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రాథమిక విచారణ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని... అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అఫిడవిట్ లో తెలిపింది. కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు కూడా ఎన్నడూ ఆదేశించలేదని తెలిపింది. 2013 ఆగస్టు తర్వాత కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరపలేదని వెల్లడించింది.

  • Loading...

More Telugu News