Train: పెరిగిపోతున్న బెడ్ షీట్ల దొంగతనం... ఏసీ రైలు పెట్టెల్లో ఉష్ణోగ్రత పెంచాలని నిర్ణయం!

  • ఏసీ పెట్టెల నుంచి బెడ్ షీట్లు తీసుకెళుతున్న ప్రయాణికులు
  • దిగే స్టేషన్ కు అరగంట ముందే బెడ్ రోల్స్ తీసుకోవాలని నిర్ణయం
  • ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా బెడ్ షీట్ల అవసరం లేకుండా చూడాలన్న యోచన

దేశవ్యాప్తంగా పలు రైళ్లలోని ఏసీ కోచ్ లలో బెడ్ షీట్లను తమ వెంట తీసుకు వెళుతున్న ప్రయాణికుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడంతో, చోరీలను అరికట్టేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్‌ కండిషన్ కోచ్‌ లలో ఉష్ణోగ్రతను పెంచాలని, ప్రయాణం ముగియడానికి కనీసం అరగంట ముందే బెడ్ షీట్లను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.

 ఉష్ణోగ్రతను పెంచే విషయంలో ఏ ప్రయాణికునికీ ఇబ్బంది కలగకుండా చూస్తామని, కోచ్ కండక్టర్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తారని స్పష్టం చేశారు. రైళ్లలో సాధారణంగా ఏసీ విభాగంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కోచ్‌ లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ కోచ్ లలో ప్రయాణించేవారికి రగ్గులతో పాటు బెడ్ షీట్లూ అందుబాటులో ఉంటాయి. కోచ్‌ లలోని ఉష్ణోగ్రతను అవసరమైనంత మేరకు పెంచడం ద్వారా రగ్గులను కప్పుకోవాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది రైల్వే శాఖ అధికారుల ఆలోచన.

More Telugu News