Chandrababu: చంద్రబాబు నేతృత్వంలో నేడు సమావేశం కానున్న బీజేపీయేతర పార్టీలు

  • హాజరు కానున్న 21 పార్టీల ప్రతినిధులు 
  • వివిధ అంశాలపై చర్చించనున్న నేతలు
  • అనంతరం ఈసీని కలవనున్న చంద్రబాబు
బీజేపీయేతర కూటమి ఏర్పాట్లలో తలమునకలైన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పలువురు నేతలను కలుస్తూ మంతనాలు సాగిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు జై కొట్టినా కూటమి పార్టీల్లో మాత్రం ఆశలు సన్నగిల్లలేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలు విరమించుకోలేదు.

ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్, అఖిలేశ్, మమత, శరద్ పవార్, మాయావతి వంటి నేతలను కలిసిన చంద్రబాబు ఫలితాల అనంతర పరిస్థితులపై చర్చించారు. కాగా, నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు చంద్రబాబు నేతృత్వంలో బీజేపీయేతర పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో 21 పార్టీల ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఈసీని కలవనున్నారు.
Chandrababu
NDA
UPA
New Delhi
EC

More Telugu News