Andhra Pradesh: నంద్యాలలో బీరు సీసాలతో వెళుతున్న లారీ దగ్ధం

  • ఇంజిన్ లో మొదలైన మంటలు
  • కొద్దివ్యవధిలో లారీ అగ్నికి ఆహుతి
  • మంటలు ఆర్పే ప్రయత్నంలో డ్రైవర్ కు గాయాలు
నంద్యాలలో ఇవాళ బీరు సీసాల లోడుతో వెళుతున్న లారీ అగ్నికి ఆహుతైంది. లారీ ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, క్షణాల వ్యవధిలో లారీ అంతా వ్యాపించాయి. లారీలో ఉన్న సరుకు బీరు సీసాలు కావడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిశాయి. మంటల ధాటికి సీసాలు పగిలిపోయి గాజు పెంకులు ఎంతో వేగంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోకి దూసుకువచ్చాయి.

ఈ హఠాత్పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఎంతో విలువైన సరుకు అగ్నికి ఆహుతి అవుతుండడంతో డ్రైవర్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి గాయాలపాలయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ లారీ హైదరాబాద్ నుంచి నంద్యాల రాగా  ఆర్టీవో ఆఫీసు ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Andhra Pradesh
Nandyal

More Telugu News