amit shah: ఎన్డీయే నేతలకు రేపు విందు ఇవ్వనున్న అమిత్ షా

  • ఎన్డీయేకు అధికారాన్ని కట్టబెట్టిన ఎగ్జిట్ పోల్స్
  • ఉత్సాహంలో బీజేపీ శ్రేణులు
  • రేపు కేంద్ర మంత్రివర్గం భేటీ అయ్యే అవకాశం
ఎన్డీయేలో ఉన్న తమ భాగస్వామ్య పార్టీల నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు విందు ఇవ్వనున్నారు. ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో బీజేపీతో పాటు ఎన్డీయేలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో, అమిత్ షా తమ మిత్రులతో విందు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు, కేంద్ర మంత్రివర్గం కూడా రేపు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 23వ తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి.
amit shah
nda
dinner

More Telugu News