Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావించిన లగడపాటి

  • ‘హోదా’కు కేసీఆర్ మద్దతిచ్చినందుకు అభినందనలు
  • పవన్ కు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు 
  • కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానిస్తారు

ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’కు మద్దతు ఇస్తానని ఎన్నికల సమయంలో కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయమై ఏపీకి మద్దతిస్తానన్న కేసీఆర్ కు తన అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించీ లగడపాటి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని, కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వారున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం యువత ‘జనసేన’ వైసీపీ కు తమ ఓట్లు వేసి ఉంటాయని భావించారు.

More Telugu News