Andhra Pradesh: చంద్రగిరిలో రీపోలింగ్ నిలిపివేయాలని పులివర్తి నాని భార్య ఆందోళన!

  • ఏడు చోట్ల జరుగుతున్న రీపోలింగ్
  • వృద్ధులకు సహాయకులను అనుమతించడం లేదని నిరసన
  • పోలీసుల సముదాయింపుతో వెనక్కి తగ్గిన సుధారెడ్డి
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలూరు, కుప్పం బాదూరు గ్రామాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి ఈరోజు ఆందోళనకు దిగారు. వెంటనే ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులు ఓటేసేందుకు సహాయకులను పోలింగ్ అధికారులు అనుమతించడం లేదని ఆమె నిరసన తెలిపారు. ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు ఆమెకు వివరించడంతో సుధారెడ్డి ఆందోళన విరమించారు.
Andhra Pradesh
chandragiri
Chittoor District
pulivarti nani

More Telugu News