Chandrababu: జాతీయ చానళ్ల అంచనాలు తప్పుకాబోతున్నాయి.. ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

  • వెయ్యి శాతం టీడీపీదే గెలుపు
  • 2014లో జాతీయ చానెళ్లన్నీ వైసీపీ గెలుస్తుందని చెప్పాయి
  • నేను ప్రధాని పదవి రేసులో లేను
2014లో జాతీయ చానెళ్లు చేసిన సర్వేలన్నీ తప్పు అయ్యాయని, ఇప్పుడూ అదే జరగబోతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని జాతీయ చానెళ్లన్నీ ముక్తకంఠంతో చెప్పాయని, కానీ టీడీపీ ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ వెయ్యి శాతం గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలపై ఎటువంటి అనుమానం అవసరం లేదని టీడీపీదే విజయమని నేతల్లో భరోసా నింపారు. గతంలోలా ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుందని జాతీయ చానెళ్లు చెప్పే అవకాశం ఉందని, వారి అంచనాలు మళ్లీ తప్పుకాబోతున్నాయని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నాను తప్పితే ప్రధాని రేసులో తాను లేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu
Telugudesam
national media
Andhra Pradesh
YSRCP

More Telugu News