TV9: టీవీ 9 కేసు: రవిప్రకాశ్ న్యాయవాది ఇంట్లో సైబరాబాద్ పోలీసుల సోదాలు

  • పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • చానల్ యాజమాన్య మార్పుపై ఫోర్జరీ డాక్యుమెంట్ల స్వాధీనం
  • న్యాయవాదిపైనా అభియోగాలు

టీవీ9 చానల్ వివాదంలో మాజీ సీఈవో రవిప్రకాశ్ పై ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రవిప్రకాశ్ న్యాయవాది జె.కనకరాజు నివాసంలో ఇవాళ సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

వాటిలో చానల్ యాజమాన్య మార్పుకు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. లభించిన ఆధారాలను బట్టి ఫోర్జరీ పత్రాలను తయారుచేయడంలో రవిప్రకాశ్ కు తోడ్పడ్డారని న్యాయవాది కనకరాజుపైనా పోలీసులు అభియోగాలు మోపారు.

TV9
  • Loading...

More Telugu News