jamuna: ఈ తరం హీరోయిన్స్ డబ్బుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు: సీనియర్ హీరోయిన్ జమున

  • ఇప్పుడొస్తున్న సినిమాలు చూడను
  •  తెలుగు హీరోయిన్స్ కనిపించడం లేదు
  •  మంచి వేషం వేద్దామనే ఆలోచన లేదు

తాజా ఇంటర్వ్యూలో జమున మాట్లాడుతూ, అప్పటికీ ఇప్పటికీ తెలుగు సినిమాల విషయంలో వచ్చిన మార్పులను గురించి ప్రస్తావించారు. "మా అప్పుడు రొమాంటిక్ సీన్స్ తీయాలంటే అందుకు ఒక పరిమితి ఉండేది. సెన్సార్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఇప్పటి సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు చాలా అసభ్యంగా ఉంటున్నాయి. అదేమంటే .. హిందీ సినిమాల పోటీని తట్టుకోవాలి గదా అని నిర్మాతలు అంటున్నారు.

అందుకే నేను ఇప్పటి సినిమాలు చూడటం లేదు .. పాత సినిమాలే చూస్తుంటాను. ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ కూడా డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నారు. మంచి వేషం వేద్దాం .. మన టాలెంట్ చూపిద్దాం అనేది ఉండదు. అసలు తెలుగు హీరోయిన్స్  కనిపించడమే లేదు. ఇతర భాషల నుంచి హీరోయిన్స్ ను తీసుకురావడం .. వాళ్లు వచ్చీరాని తెలుగులో మాట్లాడటం జరుగుతోంది" అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

More Telugu News