Telangana: ములుగు జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు.. రెండేళ్ల చిన్నారి దుర్మరణం!

  • ములుగు జిల్లాలోని జీడివాగు వద్ద ఘటన
  • ప్రమాద సమయంలో కారులోనే ఎమ్మెల్యే సీతక్క 
  • ఏటూరునాగారం ఆసుపత్రికి బాధితుల తరలింపు 
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంగపేట జీడివాగు వద్ద వేగంగా వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న దంపతులతో పాటు వారి చిన్నారి(2)కి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వీరిని ఎమ్మెల్యే కారులోనే ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాగా ప్రమాద సమయంలో సీతక్క కారులోనే ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
mulugu
Road Accident
2 years kid dead

More Telugu News