Hyderabad: భాగ్యనగరిలో హైఅలర్ట్‌...మక్కా మసీదులో పేలుళ్లు జరిగిన రోజు కావడంతో భారీ బందోబస్తు

  • ఇటీవ పరిణామాతో భద్రత కట్టుదిట్టం
  • ప్రత్యేక అధికారు పర్యవేక్షణలో నిఘా
  • 2007 మే 18న నగరంలో పెను విషాదం

పన్నెండేళ్ల క్రితం అనగా 2007 మే 18వ తేదీన హైదరాబాద్‌ నగరాన్ని కుదిపేసిన మక్కామసీదు బాంబు పేలుళ్ల ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. పాతబస్తీలోని మక్కామసీదులోని ఓ పైపులో అమర్చిన బాంబును సెల్‌ఫోన్‌తో పేల్చిన ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత జరిగిన అల్లర్ల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచనమయింది. బాగ్యనగరి వాసు మదిలో నుంచి చెరిగిపోని జ్ఞాపకాల్లో ఈ ఘటన ఒకటి. క్షణాల్లో తీవ్రవిషాదం చుట్టుముట్టేసి కళ్లముందే పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన చోటు చేసుకుని ఇన్నేళ్లయినా ఇప్పటికీ పాతబస్తీ వాసు గుండెల్లో పేలుళ్ల శబ్దాలు మారుమోగుతూనే ఉంటాయి.

దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు చోటు చేసుకున్నా ఆ మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయన్న ఆరోపణలు, ఇటీవ చోటు చేసుకున్న పరిణామా నేపథ్యంలో పేలుళ్ల రోజును దృష్టిలో పెట్టుకుని నగర వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మఫ్టీ పోలీసును మోహరించారు. అనుమానిత వ్యక్తును నీడలా వెంటాడేందుకు షాడో టీంను ఏర్పాటు చేశారు.

ఎటువంటి పరిస్థితినైనా తక్షణం ఎదుర్కొనేందుకు వీలుగా క్విక్‌ రియాక్షన్‌ టీం, స్ట్రయికింగ్‌ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాతో నిఘా పర్యవేక్షణ కొనసాగుతోంది. బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఐపీఎస్‌ అధికారుతోపాటు పలువురు సీనియర్‌ అధికారుకు ప్రాంతా వారీగా బాధ్యతలు అప్పగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుక్షణం డేగ కళ్లతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News