Siddipet District: మల్లన్న సాగర్ ఫనుల్లో అపశ్రుతి.. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు తగిలి విద్యార్థి మృతి!

  • సిద్ధిపేట మండలం తోర్నాల శివారులో ఘటన
  • కాలువ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ 
  • పైకి లేచిన రాళ్లు తగిలి డిగ్రీ విద్యార్థి అక్కడికక్కడే మృతి
మల్లన్న సాగర్ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సిద్ధిపేట మండలం తోర్నాల శివారులో మల్లన్న సాగర్ కాలువ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ జరిగింది. బ్లాస్టింగ్ సమయంలో పైకి లేచిన రాళ్లు పక్కనే ఉన్న వసతి గృహంపై ఎగిరిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ విద్యార్థికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి సురేశ్ అని, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని చల్మెడ వాసి అని గుర్తించారు. అతను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు సమాచారం.
Siddipet District
mallana sagar
medakr
Harish Rao

More Telugu News