Aditi Rao Hydary: గూగుల్‌లో తన ఫొటోలు చూసి షాక్ అయిన ముద్దుగుమ్మ!

  • ‘యే సాలీ జిందగీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ
  • అదితి నటనకు మంచి మార్కులు
  • ఇకపై గూగుల్ జోలికి వెళ్లొద్దని నిర్ణయం
సరదాగా గూగుల్‌లో వెదికిన ముద్దుగుమ్మకి దుస్తుల్లేకుండా తన ఫోటోలు కనిపించడంతో షాక్ అయిందట. అప్పటి నుంచి గూగుల్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. బాలీవుడ్ భామ అదితీ రావు హైదరీ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ఓ చాట్ షోలో అదితి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

2011లో ‘యే సాలీ జిందగీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ సినిమాలో తన నటనకు మంచి పేరొచ్చింది. ఆ సమయంలోనే అదితి సరదాగా గూగుల్‌లో వెదికిందట. అప్పుడు సినిమాలో దుస్తుల్లేకుండా ఉన్న కొన్ని ఫోటోలు కనిపించడంతో షాక్ అయిందట. అంతేకాదు ఇకపై గూగుల్‌లో వెదకకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.
Aditi Rao Hydary
Bollywood
Yeh Sali Jindagi
Google
Chat Show

More Telugu News