Sunil Arora: వివక్ష చూపించాల్సిన పని లేదు.. ఎవరు కలసి వచ్చినా పని చేస్తాం: చంద్రబాబు

  • ఫలితాల రోజే కూటమి సమావేశం
  • చంద్రబాబుకు మీడియా ఆసక్తికర ప్రశ్న
  • ఊహాజనిత  ప్రశ్నలు వద్దన్న చంద్రబాబు
ఈ నెల 23న ఫలితాల అనంతరం పరిస్థితి ఏ విధంగా ఉండనుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సోనియా గాంధీ బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితాలు వెలువడే రోజు కూటమి సమావేశం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబుకు మీడియా నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసి చంద్రగిరి రీపోలింగ్ అంశంపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను కూటమితో టీఆర్ఎస్ కలిసి వచ్చినా పని చేస్తారా? అని ప్రశ్నించింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలుస్తామని, ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలు వద్దని మీడియాకు సూచించారు.
Sunil Arora
Chandrababu
Chandragiri
Repolling
TRS
KCR

More Telugu News