District Collector: మరో రెండు చోట్ల పోలింగ్‌కు సిఫార్సు చేసిన కలెక్టర్

  • ఈసీ, సీఎస్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
  • అన్ని కేంద్రాల సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన కలెక్టర్
  • 310, 323 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని సిఫార్సు
చిత్తూరు నియోజకవర్గంలోని ఐదు చోట్ల జరగనున్న రీపోలింగ్‌తో పాటు మరో 19 చోట్ల కూడా రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నేడు ఈసీ, సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే చిత్తూరు జిల్లాలో మరో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి కలెక్టర్ సిఫార్సు చేశారు. 310, 323 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన తెలిపారు. అన్ని కేంద్రాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన మీదట ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. దీనిపై సీఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
District Collector
Chittor
Repolling
Booths
EC
CS

More Telugu News