Chittoor District: చంద్రగిరిలో రీపోలింగ్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలి: ద్వివేది

  • చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ద్వివేది సమీక్ష
  • పోలీస్ బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణపై చర్చ
  • స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి

ఈ నెల 19న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు బూత్ లలో రీపోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సమీక్షించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణ తదితర అంశాలపై వారితో చర్చించారు.

రీపోలింగ్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ బూత్ ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయా బూత్ లలోని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా తగు చర్యలు చేపట్టాలని, ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని అధికారులకు ద్వివేది సూచించారు.

గత నెలలో జరిగిన ఎన్నికల పోలింగ్ సమయంలో చంద్రగిరిలో తప్పు జరిగినందువల్లే రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందని ద్వివేది స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకుంటుందని, టీడీపీ కోరిన 18 చోట్ల వీడియో ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  

More Telugu News