Sudha Rani: నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్‌కు మేము సిద్ధం.. మీరు సిద్ధమేనా?: చెవిరెడ్డికి నాని భార్య సవాల్

  • ఎన్ని డ్రామాలాడినా టీడీపీ గెలుపు ఖాయం
  • చెవిరెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారు
  • చెవిరెడ్డి ఫిర్యాదుకు ఈసీ స్పందించడమేంటి?
నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్‌కు తాము సిద్ధమని, దానికి మీరు సిద్ధమేనా? అని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య సుధారాణి సవాల్ విసిరారు. రీపోలింగ్ జరగనున్న పులివర్తివారిపల్లిలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ, ఎవరెన్ని డ్రామాలాడినా టీడీపీ గెలుపు ఖాయమన్నారు.

టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు చెవిరెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. తాము 25 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని పోలింగ్ జరిగిన మరుసటి రోజే కోరినా ఈసీ స్పందించలేదని, నిన్నగాక మొన్న వచ్చిన చెవిరెడ్డి ఫిర్యాదు చేస్తే స్పందించడమేంటి? అంటూ సుధారాణి ప్రశ్నించారు.
Sudha Rani
Pulivarthi Nani
Chevireddy Bhaskar Reddy
Telugudesam
EC

More Telugu News